telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సినిమా వార్తలు

మరింత చౌకగా.. టాటా స్కై.. సెట్-టాప్ బాక్స్ ధరలు…

tata sky hd prices cut again

టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మళ్ళి తగ్గించింది. గత ఆరు నుండి ఎనిమిది నెలల్లో సెట్-టాప్ బాక్స్ ధరలను తగ్గించడం ఇది ఐదవ సారి. ట్రాయ్ టారిఫ్ పాలన ఏప్రిల్ 1 2019లో పూర్తిగా అమలులోకి వచ్చిన వెంటనే టాటా స్కై తన సెట్-టాప్ బాక్స్‌ల యొక్క ధరల మీద రూ.400 తగ్గించింది. తరువాత పరిశ్రమలో పోటీని తట్టుకోవడానికి ధరలను మరింత తగ్గించారు. గత ఏడాది అక్టోబర్‌లో డిటిహెచ్ ఆపరేటర్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ కేవలం 1,199 రూపాయలకు మాత్రమే అందించింది. టాటా స్కై ఇప్పుడు తన హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మళ్లీ తగ్గించింది.

ఇది ఇప్పుడు ‘స్పెషల్ ఆఫర్’లో భాగంగా కేవలం 1,399 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందో కంపెనీ వెల్లడించనప్పటికీ ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు కొన్ని వారాల వరకు మాత్రమే అమలులో ఉంటుంది అని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి. డిటిహెచ్ రంగంలో 31.61% మార్కెట్ వాటాతో టాటా స్కై ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ గా ఉంది. టాటా స్కై ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా తక్కువ ధర వద్ద సెట్-టాప్ బాక్స్‌లను వినియోగదారులకు అందిస్తున్నది. అయితే ఈ పరిస్థితి SD మరియు HD STB లకు మాత్రమే వర్తిస్తుంది. ఇటీవల ప్రారంభించిన టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టివి ఎస్‌టిబి ధర రూ.5,999 లుగా ఉండి ప్రత్యర్థి ఆపరేటర్ల నుండి అదే ఆండ్రాయిడ్ టివి బాక్స్‌లతో పోలిస్తే తక్కువ ధరతో ఉంది.

టాటా స్కై ప్రస్తుతం అందిస్తున్న సరికొత్త ‘స్పెషల్ ఆఫర్’లో భాగంగా HD సెట్-టాప్ బాక్స్ ను కేవలం రూ.1,399 వద్ద పొందవచ్చు. ఇదే ధర వద్ద SD సెట్-టాప్ బాక్స్ ను కూడా పొందవచ్చు. HD కనెక్షన్ల సంఖ్యను మరింతగా పెంచడానికి ఈ చర్యను తీసుకున్నట్లు టాటా స్కై తెలిపింది. ఇవి కేవలం కనెక్షన్ ఛార్జీలు మాత్రమే. కొత్త కనెక్షన్ల కోసం అదనపు ఇన్‌స్టాలేషన్ మరియు ఇంజనీర్ విజిట్ ఛార్జీలు ఉంటాయని గమనించండి. SD కనెక్షన్ నుండి HD కనెక్షన్ కు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛార్జీలు రూ.1,199 గా ఉన్నాయి. టాటా స్కై యొక్క బింగే +, టాటా స్కై 4K మరియు టాటా స్కై + HD వంటి ఇతర సెట్-టాప్ బాక్స్‌లు వరుసగా రూ.5,999, రూ.6,400 మరియు రూ.9,300 ధరలతో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. టాటా స్కై తన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ధరను తగ్గించి ఉంటే కొత్త వినియోగదారులకు ఇది చాలా బాగుండేది. కానీ వాటి యొక్క ధరలను మాత్రం తగ్గించలేదు.

Related posts