వార్తలు సామాజిక సినిమా వార్తలు

తారు మారు…

taru maru poetry corner
అప్పుడు …మనం,
ఆంగ్లేయుల పాలనలో  ఉన్నాం,
మన సంస్కృతీ ..సంప్రదాయాలకు,
ఆనకట్ట పడలేదు …
పాశ్చ్యాత్యుల నీడ …
నీడగానే మిగిలిపొయింది !
 
ముసల్మానుల పాలనలో,
మునిఁగి తేలాం ….
అయినా ….
మన ..కట్టూ ..బొట్టూ …
చెక్కు చెదరలేదు …!
 
మన ఆడపడుచుల ..
చీరకట్టు …
తరతరాలుగా కదలి వస్తున్న,
అపురూప కళా కనికట్టు !
చీర కట్టుముందు …
నిలబడలేదు …
ఏవిధమైన ఆహార్య పనిముట్టు !!
 
చేనేత చీరల్లో …
స్త్రీ మూర్తుల సొగసులు,
సింథటిక్ చీరల్లో …
మహిళా మణుల అందచందాలు,
వర్ణించ వీలుగాని,
సౌందర్య సీమలు …!!
 
కాలం మారింది …
మన సంస్కృతిని ..సంప్రదాయాలను,
పాశ్చాత్యులకు ఎగుమతి చేసి …
అక్కడి వాటిని …
మనం దిగుమతి చేసుకుంటున్నాం !
 
మాతృ భాష …
అంతరిస్తున్న చందం …
చీరకట్టు సంప్రదాయం 
గాలికెగిరిపోయే ప్రమాదంలో ఉంది !
మన ఆడపడుచుల 
ఆహార్యం …
బోర్లాపడే వీలుంది …!!
 
-డా.కె .ఎల్ .వి.ప్రసాద్,
    హనంకొండ

Related posts

మేలో "రాజుగాడు" వచ్చేస్తున్నాడు…

admin

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా!

madhu

ఇండియాలో ఆ పరిస్థితి లేదు

jithu j

Leave a Comment