telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రీమేక్ లు చేయబోవటంలేదు.. గాసిప్స్ కు చెక్ పెట్టిన తాప్సి..

tapsy clarity on remake movie gossips

చిత్ర పరిశ్రమ అంటేనే రోజుకు ఎన్ని గాసిప్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నిజాలెన్నో, అబద్ధాలెన్నో తెలియక సినీ లవర్స్ తికమకపడుతుంటారు. తాజాగా తాప్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో సూపర్ హిట్ సాధించి ఆ తర్వాత తెలుగులోను తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం యూ టర్న్‌. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ మూవీకి మంచి ఆదరణ లభించడంతో హిందీలోను రీమేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు గాసిప్ రాయుళ్ళు ప్రచారం చేశారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన తాప్సీ.. నేను ఏ రీమేక్ చిత్రం చేయడం లేదు. నన్ను ఎవరు సంప్రదించలేదు. ఒకవేళ ఆ సినిమా చేయాలని నాకు ఆఫర్ వచ్చిన, నేను చేయను అని కుండబద్దలు కొట్టింది.

Related posts