ఆరోగ్య వార్తలు సినిమా వార్తలు

అసలైన మృగాళ పేర్లు ఇంకా బయటపడలేదు : తాప్సి #మీటూ

Tapsee

సినీరంగం నుంచి క్రీడారంగం వరకూ ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్, సాజిద్ ఖాన్, కన్నడ సింగర్ రఘు దీక్షిత్, తమిళ గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితులకు భారీగానే మద్దతు లభిస్తోంది. తాజాగా మీటూ ఉద్యమంపై తాప్సీ స్పందించింది.

“మీటూ పేరుతో బాధితులు బయటపెడుతున్న పేర్ల కంటే, వాళ్లు ఏ రకంగా లైంగిక వేధింపులకు గురయ్యారో వివరిస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇప్పటివరకూ బాధితులు చెప్పిన వివరాలు, బయటపడిన పేర్లు చాలా తక్కువ… మహిళా ఆర్టిస్టులు, నటీమణులను వేధించుకు తినే అసలుసిసలైన మృగాళ్ల పేర్లు ఇంకా బయటకు రాలేదని తనకు అనిపిస్తోందని పేర్కొంటూ మీటూ హ్యష్ ట్యాగ్ తో తాప్సి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

అయిత్ లైంగిక వేధింపులపై తాప్సి స్పందించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను లైంగిక వేధింపుల గురించి విన్నానని, కానీ తనకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని, ఒకవేళ ఎవరైనా తనతో అలా ప్రవర్తిస్తే వారికి తాను సరిగ్గా సమాధానం చెప్పేదాన్నని తెలిపింది.

Related posts

‘ఆఫీసర్’ ట్రైలర్…

admin

“జబర్దస్త్” టీం ఇక జైలుకేనా ?

chandra sekkhar

“అరవింద సమేత” పై మెగా ఫ్యామిలీ పొగడ్తల వర్షం..

jithu j

Leave a Comment