telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జిమ్‌ చేస్తున్న తాప్సి..

ఝుమ్మంది నాదం సినిమాతో  తాప్సి తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది. లేడీ ఓరియాంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి వరుస సినిమాలు చేస్తోంది. ఆ సినిమాల్లోని పాత్రలకు కావలసిన విధంగా తనను తాను మార్చుకుంటూ అందరిని అబ్బురపరుస్తోంది. అయితే ప్రస్తుతం తాప్సీ క్రీడా నేపథ్యంలో ఓ సినిమాను చేస్తోంది. ఆ సినిమాకు లక్ష్మీ రాకెట్ పేరును ఖరారు చేశారు. పరుగుపందెం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమా కోసం తాప్సీ తెగ కష్టపడుతోంది. ఇటీవల తాను జిమ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలో తన బ్యాక్ మజిల్స్‌ను చూసిస్తూ ఉంది. రెండు చేతుల్లో బరువును మోస్తూ జిమ్ చేస్తున్న ఫోటో అది. దాంతో పాటుగా వన్ మోర్ రెప్ అని ట్యాగ్ చేసింది. దాంతో పాటు జిమ్‌లో బాడ్ హెయిర్ డే అని ఫోటో కింద రాసింది. అంతేకాకుండా లక్ష్మీ రాకెట్ త్వారలో వస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts