• Home
  • వార్తలు
  • బిజినెస్ రంగంలోకి దిగిన తాప్సీ .. ఆరంభంలోనే కోట్లు…!
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సినిమా వార్తలు

బిజినెస్ రంగంలోకి దిగిన తాప్సీ .. ఆరంభంలోనే కోట్లు…!

Taapsee Pannu images

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావ్ దర్శకత్వంలో…. జుమ్మందినాధం సినిమా ద్వారా వెండితెరకు పరిచమై ప్రముఖ కథానాయిక తాప్సీ పన్ను… ఇటు టాలీవుడ్ లోనే బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగాల్లో దూసుకుపోతుంది… బాలీవుడ్ లో నామ్ షబానా, పింక్ లాంటి ప్రాధాన్యం పొందిన సినిమాల్లో కథానాయికగా నటించిన ఈ ముద్దుగుమ్మ వార్ ఫిలిం అయిన ‘ది ఘాజీ అటాక్’ లాంటి సినిమాలో కూడా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది… అలాగే ఈ ఏడాది తాప్సీ నటించిన ముల్క్, సూర్మ, మన్మర్జియాన్ సినిమాలు విడుదలై క్రిటిక్స్ తో పాటు అభిమానులనుంచి మంచి స్పందన లభించింది.. దీనితో ఇప్పటివరకు ఈ అమ్మడు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా డబ్బు బాగానే పోగేసింది…

Taapsee Comments on Casting Couch

అయితే సాధారణంగా సినీ రంగంలో నటీనటులు డబ్బులు పోగేస్తే ఆ డబ్బును నిర్మాణ రంగంలో పెట్టడం చూసాం కానీ ఈ అమ్మడు మాత్రం పోగేసిన డబ్బంతా స్పోర్ట్స్ పై పెడుతుంది.. ఎందుకంటే ఈ అందాల తారకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట… అందుకోసమే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఓ టీమ్ కొనుగోలు చేయాలని సన్నాహాలు రూపొందిస్తుంది.. అలాగే ఆ వెంచర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలని దానిపైనే కాన్సట్రేట్ చేయనున్నానని తెలిపింది… ఆటలు అంటే ఇష్టం కానీ అటు వెళ్లే కోరిక ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ కాలేదు.. అందుకోసమే స్పోర్ట్స్ కి సంబంధించిన వాటితో అసోసియేట్ అవుతున్నానని అన్నారు.. అంతేకాకుండా సినిమాలపై కూడా మంచి క్లారిటీ ఇచ్చారు..

కొన్నేళ్ల క్రితం వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ మొదలు పెట్టినపుడు సినిమాల్లోకి ఇక రాను అని అందరు అనుకున్నారు.. కానీ వచ్చాను.. సినిమా అనేది ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది.. ఇవన్నీ సైడ్ బిజినెస్ లు మాత్రమే.. అంటూ పేర్కొన్నారు… పూణె బ్యాట్మింటన్ టీంతో ‘పూణె సెవెన్ ఏసెస్’ పేరుతో లీగ్ లోకి ఎంటర్ అవుతున్నానని అక్టోబర్ 8న ప్లేయర్స్ వేలం మొదలుకానుందని నా టీం లో బలమైన ప్లేయర్స్ ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తానని ఈసారి బ్యాట్మింటన్ లీగ్ లో మంచి వినోదం పంచబోతున్నానని పేర్కొంది…

Related posts

నిరుద్యోగ సమస్యను అత్యాచారాలకు అంటగట్టిన కేంద్రమంత్రి భార్య.. విమర్శలు

nagaraj chanti

పోలీసు అయ్యుండి…సొంత కుమార్తెను కాపాడుకోలేక బోరుమంటూ…

chandra sekkhar

నన్ను ఎవరూ ఆపలేరు : అజారుద్దీన్

admin

Leave a Comment