telugu navyamedia
సినిమా వార్తలు

పార్టీ కోసం కొట్టుకోకండి…  అమితాబ్, షారుఖ్ తీరుపై తాప్సి 

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన “బద్లా” చిత్రం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను నిర్మించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అయితే సినిమా హిట్ అయినా, 100 కోట్లు సాధించినప్పటికీ చిత్ర నిర్మాతలు స్పందించలేదని, బిగ్ బీ ఇటీవల ట్వీట్ చేయగా… స్పందించిన షారుఖ్ “మీరు పార్టీ ఎప్పుడిస్తారా అని రోజూ రాత్రిపూట మీ ఇంటి ముందే ఎదురు చూస్తున్నాము” అంటూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అమితాబ్ స్పందిస్తూ “పార్టీ కూడా నేనే ఇవ్వాలా?” అని చమత్కరించారు. ఇది గమనించిన తాప్సి “ముంబై వచ్చాక నేనే పార్టీ ఇస్తాను. ఇకనైనా వాదులాడుకోవడం ఆపండి. పార్టీకి అందర్నీ పిలుస్తాను” అంటూ తాప్సీ తన సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించింది.

Related posts