telugu navyamedia
సినిమా వార్తలు

న్యూయార్క్ లో జాతివివక్షకు గురైన మరో బాలీవుడ్ నటి

Tanishaa Mukerji

అమెరికాలోని న్యూయార్క్ లో బాలీవుడ్ నటి, బిగ్ బాస్-7 ఫైనలిస్ట్ తనిషాకు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్ లోని జేన్ హోటల్ లో ఆ ఘటన జరిగింది. మార్చి 10న ఈ సంఘటన జరిగిందని, జేన్ హోటల్ సిబ్బంది జాత్యహంకారం గల దారుణమైన వ్యక్తులంటూ ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని వెల్లడించింది తనీషా.

ఓ ఛారిటీకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా న్యూయార్క్ కు వెళ్లిన తనీషా అక్కడ జేన్ హోటల్లో దిగింది. ఈ నేపథ్యంలో తన సహచరులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా హోటల్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దారుణమైన వ్యాఖ్యలు చేశాడట. ఈ విషయం గురించి తాను హోటల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని, అమెరికాలో వర్ణవివక్షను ఎదుర్కోవడం తనకు ఇదే మొదటిసారని వెల్లడించింది తనీషా. అయితే బాలీవుడ్ సెలెబ్రిటీలు ఎంతోమంది వర్ణ వివక్షను ఎదుర్కొన్నవారిలో ఉన్నారు. గతంలో శిల్పాశెట్టి “బిగ్ బ్రదర్-5” అనే రియాలిటీ షోలో వర్ణవివక్షకు గురై, అందులోనే విజేతగా నిలవడం గమనించాల్సిన విషయం.

Related posts