telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి.. తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి

potluri Ravi TANA

తానా సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి అన్నారు. పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ అందరి సహకారంతో భాద్యతలు నిర్వరిస్తానని ఆయన పేర్కొన్నారు. పూర్వాధ్యక్షులు కోమటి జయరాం, గంగాధర్ నాదెళ్ళ, వేమన సతీష్ ల స్పూర్తితో ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి ఆధ్వర్యంలో ప్రస్తుత నాయకత్వ బృందం, దాతలు, సభ్యుల సహకారంతో తానాను సంస్థను ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

నందమూరి బాలకృష్ణకు అమెరికాలో అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పొట్లూరి రవి 2013 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ అధ్యక్షుడిగా టి.ఏ.జి.డి.వి. వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరయ్యారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి స్వంతంగా విరాళాలు ఇవ్వటమే కాకుండా 2012లో నలభైవేలకు పైగా విరాళాలు సేకరించి బాలకృష్ణకు అందజేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 2018 ఆగస్టులో రెండు లక్షల విరాళం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

తానా పత్రికకు విరాళాల సేకరణ, ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో భారీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి పనులను విజయవంతంగా నిర్వహించి పొట్లూరి రవి పేరు సంపాదించుకున్నారు. మాజీ ఎంపీ మూర్తి బృందం అలస్కా లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు అప్పటి అధ్యక్షుడు సతీష్ వేమనతో కలిసి కొన్ని గంటల్లోనే ప్రమాదస్ధలికి చేరుకుని కార్యక్రమాలు పర్యవేక్షించారు. అమెరికాలోనే కాకుండా 2016లో కర్నూలు లో తానా ఆధ్వర్యంలో మూడురోజులపాటు జాతీయస్థాయి నాటకపోటీలు నిర్వహించి రవి అందరి ప్రశంసలు అందుకున్నారు.

కర్నూలు నగరంలోని పదహారు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్ లో డిజిటల్ క్లాసురూములు ఏర్పాటు చేశారు. మహిళాపోలీసుల కోసం రెండులక్షలతో ఎలక్ట్రిక్ సైకిల్స్ అందజేశారు. కర్నూలు గోశాల కు విరాళం అందజేశారు. కర్నూలు జిల్లాలో ముఠాతగాదాల్లో నష్టపోయిన ఫ్యాక్షన్ బాధిత గ్రామం కప్పట్రాళ్ళను దత్తత తీసుకుని తానా అధ్యక్షులు సతీష్ వేమన, మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి సహకారంతో దాదాపు అరవై లక్షల స్వంత నిధులతో మహిళలకోసం స్త్రీ శక్తి భవనం నిర్మించారు.

పదోతరగతితో చదువు ఆపేసిన కప్పట్రాళ్ళ విద్యార్థినిని దత్తత తీసుకుని ఉన్నతచదువులు చదివిస్తున్నారు. కప్పట్రాళ్ళ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం లక్షరూపాయలకు పైగా స్కాలర్షిప్స్ అందజేయటమే కాకుండా డిజిటల్ క్లాసురూమ్, లైబ్రరీ, క్రీడాపరికరాలు, కంప్యూటర్స్ ఏర్పాటు చేశారు. 2019 జనవరిలో పదిలక్షలకు పైగా వెచ్చించి తానా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహంచడంలో రవి కీలకపాత్ర పోషించారు.

Related posts