telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సంతకాలు ప్రాంతీయ భాషలోనే … తమిళ సర్కార్ ఆదేశాలు.. పోలీసులకు మాత్రమే..

tamil police should sign in local language only

ప్రాంతీయ భాషకు మెండుగా గౌరవించే తమిళనాడు రాష్ట్రంలో పోలీసు శాఖలో కొత్త రూల్ తీసుకొచ్చారు. పోలీస్ శాఖలో తమిళం తప్పని సరి చేశారు. హాజరుపట్టికలో సంతకాలు తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు. ఆఫీస్ రికార్డులను కూడా తమిళంలోనే మెయింటేన్ చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని డీజీపీ స్పష్టం చేశారు. స్టేట్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ కమిషనరేట్లు, సూపరింటెండెంట్ ఆఫీసుల్లోనూ రికార్డులను తమిళంలో మెయింటేన్ చేయాలని, సంతకాలు తమిళంలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. డ్రాఫ్ట్ కరస్పాండెన్స్, కమ్యూనిక్యూ, నేమ్ బోర్డులు, చివరికి ఆఫీస్ సీల్స్ కూడా తమిళంలోనే ఉండాలని చెప్పారు.

పోలీసు వాహనాలపై కవల్(పోలీస్) అనే పదం కనిపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. డీజీపీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ తమిళనాడు విభాగం సమీక్ష జరిపింది. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖలో తమిళం తప్పనిసరి చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇది మంచి నిర్ణయం అంటున్నారు. మాతృభాషకి పెద్దపీట వేసినట్టు అవుతుందన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలు అవసరమే అన్నారు. అసలే మాతృభాష పట్ల తమిళ తంబీలకు అమితమైన అభిమానం ఉంది. మాతృభాషకు తమిళ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు పోలీస్ శాఖలో తమిళం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నారు.

Related posts