telugu navyamedia
సినిమా వార్తలు

మొగుడా వెళ్ళిపోతున్నాను… సినీనటి సూసైడ్ నోట్

yashika

ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీలో నటి యాషిక అలియాస్ ఎస్తర్ ఫ్యూలా రాణి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ప్రేమించిన వ్యక్తితో గొడవల కారణంగా మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. తన ప్రియుడు తనను విడిచిపోవడం వల్లేయాషిక మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖ ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే యాషిక ప్రేమించిన వ్యక్తి మోహన్ బాబు అలియాస్ అరవింద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సూసైడ్ లెటర్ విషయం వైరల్ గా మారింది.

“హాయ్‌ మొగుడా… ఐ లవ్‌ యూ సోమచ్‌… నువ్వంటే నాకు ప్రాణం. నాపై నీకు ప్రేమ లేదని నాకు తెలుసు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏడాది పాటు ఇద్దరం దంపతులుగా జీవించాం. నాపై నీకు కొంచం కూడా ఫీలింగ్ లేదు. అన్ని విషయాల్లో నేనే సర్దుకుపోయాను. నువ్వు ఎవరి గురించి ఆలోచించవు. అన్నం తిని మూడు రోజులైంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇక నిన్ను కష్టపెట్టను. నేను మరణించిన తరువాత నన్ను తలచుకుంటావో లేదో తెలియదు కానీ నాకు బ్రతకాలని లేదు. ఐ లవ్‌ యూ మామా… ఐలవ్‌ యూ అరవింద్… మొగుడా వెళ్లిపోతున్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలనే వెళుతున్నా” అంటూ యాషిక తన ఆత్మహత్య లేఖలో రాసుకొచ్చారు.

Related posts