telugu navyamedia
సినిమా వార్తలు

పడుకుంటేనే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Vijay-Devarakonda

ప్రముఖ తమిళ నటి శాలు షమును సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ దర్శకుడు తనని సినిమా ఛాన్స్ పేరుతో వాడుకోవాలని ప్రయత్నించాడని పేర్కొంది. శాలు షము తమిళంలో కాంచీవరం, మయిలు లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. శాలు షము ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖలు చేసింది. మీరెప్పుడైనా చిత్ర పరిశ్రమలో మీటూ సంఘటనలు ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా తనకు ఎదురైన ఘటనని వివరించింది.

“కొన్ని రోజుల క్రితమే నాకు మీటూ సంఘటన ఎదురైంది. తనతో పడుకుంటే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు నన్ను అడిగాడు. అంతటితో అతడితో మాట్లాడటం ఆపేసి ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. అతడిపైన ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు ఎదురనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు” అని శాలు షము పేర్కొంది.

Related posts