telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినీ నటి ఆత్మాహుతి .. ప్రియుడిని వదలొద్దని..

tamil actor suicide since lover

ఇటీవల సినీ, టీవీ నటుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వీటిలో ఎక్కువ ప్రేమవ్యవహారాలే కావడం విశేషం. ప్రియుడితో గొడవలు మొదలవగానే, సున్నిత ఆలోచనలతో, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, తమిళ సినీ, టీవీ నటి యషిక ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది.

గతంలో వడపళనిలోని ఓ హాస్టల్‌లో ఉండే యషిక పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజలు క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. మనస్తాపం చెందిన యషిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు యషిక ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పలు సీరియళ్లలో నటించిన యషిక.. విమల్ హీరోగా నటించిన ‘మన్నార్ వగెరా’ సినిమాలో నటించింది. యషిక మృతిపై తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Related posts