telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పక్కింటి అమ్మాయితో పరారైన హీరో

Tamil Actor Siva

వివాహమై భార్యా, పిల్లలు ఉన్న ఓ యువనటుడు పక్కింటి అమ్మాయితో ప్రేమాయణం సాగించి, ఆమెను తీసుకుని పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి అనే గ్రామానికి చెందిన శివ “పయపులై” అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ తరువాత చిన్నచిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. శివ రామావరం అనే ప్రాంతంలోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని మందలించారు. దీంతో ఇప్పటికే తనకు పెళ్లయిందని, విడాకులు కూడా తీసుకున్నానని నమ్మించి, ఆ అమ్మాయితో పరారయ్యాడు.

కుమార్తె కన్పించకపోవడంతో ఆందోళనపడిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ జంట కోసం తీవ్రంగా గాలిస్తుండడంతో విషయం తెలుసుకున్న శివ ఆ అమ్మాయితో సహా పోలిసుల ఎదుట లొంగిపోయాడు. అయితే తన భార్యకు విడాకులిచ్చి, ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని శివ పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఆ అమ్మాయిని తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు.

Related posts