telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మనో దుర్మరణం

Mano

తమిళ యువ నటుడు మనో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీపావళి రోజే ఈ ప్రమాదం జరిగింది. ‘పుగళ్’ అనే తమిళ సినిమాలో మనో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మనో ఎక్కువ పేరు సంపాదించాడు. సన్ టీవీలో వచ్చే ఓ డ్యాన్స్ షోకు యాంకర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. మనో తన భార్యతో కలసి దీపావళి రోజు చెన్నైకి వెళ్తుండగా సెంటర్ మీడియమ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మనో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మనో అక్కడిక్కడే చనిపోయాడు. అతడి భార్యను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మనో దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ఓ వైపు తండ్రి చనిపోయి, మరోవైపు తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉండగా… ఆ కుమార్తెను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మనో మరణంపై తమిళ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు

Related posts