telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండవసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో

Karthi

తమిళ స్టార్ హీరో కార్తీ రెండవసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి రంజనీ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. డెలివరీ డేట్ కూడ దగ్గరపడింది. అందుకే కార్తీ పనులన్నిటినీ పక్కనపెట్టేసి ఈరోడ్ నందు ఉన్న తన మామగారి ఇంట్లోనే ఉంటూ భార్యను చూసుకుంటున్నాడు. 2011లో వివాహం చేసుకున్న కార్తీ, రంజనీలకు 2013లో అమ్మాయి పుట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆయన గత చిత్రం ‘ఖైదీ’ తమిళంతో సమానంగా తెలుగునాట కూడ భారీ బ్లాక్ బస్టర్ అయింది. కార్తీ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. వృత్తిరీత్యా ‘ఖైదీ’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ ముగిసింది. త్వరలోనే మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణలో జాయిన్ కానున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో మంచి స్టార్ డమ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ నుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందనే నమ్మకం ఉంది ప్రేక్షకుల్లో. అందుకే స్వతహాగా తమిళ హీరోనే అయినా తెలుగులో కూడ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Related posts