telugu navyamedia
సినిమా వార్తలు

కోహ్లీతో డేటింగ్ పై తమన్నా కామెంట్స్

Tamannaah images

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. తెలుగులోనే తమిళ, హిందీ భాషల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ లలో కూడా నటించింది. సెలెబ్రిటీలన్నాక రూమర్స్ సాధారణం. అయితే తమన్నా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. 2012లో తమన్నా, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి ఓ యాడ్ లో నటించారు. అయితే అప్పట్లో కోహ్లీకి తమన్నాకు మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వాళ్లిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు విరాట్ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నాడు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… తాజాగా ఓ షోలో తమన్నాకి విరాట్ తో ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సంబంధించిన తమన్నా యాడ్ లో నటించిన తరువాత విరాట్ ను ఒక్కసారి కూడా కలవలేదని, షూటింగ్ సమయంలో కూడా ఇద్దరి మధ్యా ప్రొఫెషన్ కు సంబంధించిన మాటలే సాగేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ “క్వీన్” రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ” చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts