• Home
  • Trending Today
  • “ఎన్టీఆర్”లో జయప్రదగా తమన్నా…?
Trending Today సినిమా వార్తలు

“ఎన్టీఆర్”లో జయప్రదగా తమన్నా…?

jayaprada-and-tamannah

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‘బయోపిక్’ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలిభాగాన్ని’ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రెండో భాగాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రూపొందిస్తున్నారు. అంతేకాదు ఆ రెండు భాగాల విడుదల తేదీని కూడా ప్రకటించారు. 9 జనవరి 2019న మొదటిభాగం, 24 జనవరి 2019 రెండో భాగం విడుదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. నిన్ననే చిత్రబృందం ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ లుక్ ని విడుదల చేసింది. ఈ పాత్ర నిమిత్తం పారితోషికంగా రకుల్ కి కోటి రూపాయలు ముట్టజెప్పారట. ఇక శ్రీదేవిగా రకుల్ లుక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే విమర్శలు బాగా విన్పిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తోందంటూ ఎన్ని వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ స్పందించకుండా నేరుగా శ్రీదేవిగా రకుల్ లుక్ ని విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మరి తమన్నా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రవణ్.. మొదటి సంతకం వీరికోసమే

nagaraj chanti

మూడు త‌రాల ప్ర‌తినిధి…నిర్జ‌న వార‌ధి

chandra sekkhar

ఆ హీరోయిన్ కు 6 కోట్ల గిఫ్ట్… ఇచ్చింది బాయ్ ఫ్రెండ్…

jithu j

Leave a Comment