telugu navyamedia
telugu cinema news trending

కమల్, రజనీ రాజకీయాలపై తమన్నా స్పందన

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగుతోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇరు భాషలకు చెందిన పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. హిందీలోనూ పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్‌ కూడా చేస్తోంది. ఇటీవలే “సైరా” చిత్రంలో కీలకపాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. కాగా… రాజకీయాల్లో కలిసి పని చేయాలనుకుంటున్న తమిళ అగ్ర కథానాయకులు కమల్ హాసన్, రజినీకాంత్‌కు తమన్నా మద్దతు పలికింది. వారిద్దరూ కలిసి పనిచేస్తే తమిళ ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడింది. ఇటీవల ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి తమిళనాడులోని తిరుచ్చి వెళ్లిన తమన్నా విలేకరుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. “కమల్, రజనీలను చిన్న వయసు నుంచే దేవుళ్లలా చూస్తున్నాను. వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎగిరి గంతులేస్తా. ప్రజలకు సేవ చేయగలమన్న నమ్మకంతోనే కమలహాసన్, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారు. వారికి ప్రజాదరణ ఉంది. వారిద్దరూ కలిసి ప్రజలకు మంచి చేస్తారని నమ్ముతున్నాను” అని తమన్నా వ్యాఖ్యానించింది. అలాగే మంచి అబ్బాయి దొరికితే పెళ్లికి సిద్ధమని, ఎవరు మంచి వరుడిని చూసిపెట్టినా పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

Related posts

రిపబ్లికన్లపై .. కొండంత ఆశతో.. ట్రంప్..

vimala p

తెల్లటి బియ్యం.. దీనితో వచ్చే తిప్పలెన్నో .. తెలుసా.. !

vimala p

రూల్స్ లేవని .. ఎంజాయ్ చేసిన క్రికెటర్ ..

vimala p