telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరోతో తమన్నా డేటింగ్…!?

Tamanna images
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని, భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న తమన్నా ఇప్పటికి పలు చిత్రాలతో బిజీ తారగానే కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మిల్కీ బ్యూటీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. డేటింగ్ కు వెళ్తే ఎవరితో వెళ్తారు ? అనే ప్రశ తమన్నాకు ఎదురవగా… ఆమె వెంటనే విక్కీ కౌశల్ అని చెప్పేసింది.
పుల్వామా ఘటనతో ఇటీవల కాలంలో విక్కీ కౌశల్ నటించిన “ఉరి : సర్జికల్ స్ట్రైక్స్” సినిమా, సినిమాలో విక్కీ నటన అందరినీ బాగా ఆకట్టుకుంది. దీంతో విక్కీ కౌశల్ కు క్రేజ్ కూడా పెరిగింది. తమన్నా కూడా తాను విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తానని చెప్పడానికి ఇదే కారణమని వివరించింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… ఎవరెవరో ఏవేవో ఆరోపణలు చేస్తుంటారని, వాటి గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలని, కానీ తనకు ఒక్కోసారి ఇదో ఆటలా మారిపోయిందని అనిపిస్తోందని, కేవలం తమకు ఎదురైన అనుభవాలను మాట్లాడుకోవడానికే మీటూ ఉద్యమం ఉందని చెబుతూ మీటూపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది తమన్నా 

Related posts