telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘తుపాకి’ సీక్వెల్​లో తమన్నా భాటియా..!

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ స్టార్​ హీరో విజయ్​, డైరెక్ట‌ర్‌ మురుగదాస్​ కాంబినేషన్​లో 2012లో వ‌చ్చిన చిత్రం ‘తుపాకి’. తమిళ, తెలుగు భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం మూవీకి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్లానింగ్ జ‌రుగుతుంది. ఇందులో విజయ్​ సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్​గా ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. ఎస్పీ రాజ్​కుమార్​ దర్శకత్వంలో విజయ్​-తమన్నాలు కలిసి నటించిన ‘సుర’ సినిమా 2010లో రిలీజైంది. దాదాపు పదేళ్ల అనంత‌రం మురుగదాస్​ సినిమా కోసం వీరిద్దరూ మళ్లీ కలిసి నటించనున్నారని తెలుస్తోంది. త‌మ‌న్నా ప్రస్తుతం సంపత్​ నంది, హీరో గోపించంద్‌తో తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’​లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి​గా నటిస్తోంది. మ‌రోవైపు విజయ్​ ‘మాస్టర్’​ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Related posts