telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్…

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక మంచి దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వకీల్‌సాబ్ పూర్తి చేసుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ సినిమాతో పాటు అయ్యపనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్‌ను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా వకీల్‌పాబ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. వకీల్‌సాబ్ సినిమా హిందీ పింక్ సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఈ సినిమాకి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించారంట. చిత్ర యూనిట్ ఎన్నింటిని జోడించిన ప్రేక్షకుల ఊహలను అందుకోలేక పోతున్నాట్లు అనిపించడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ పాటకు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డాన్స్ చేయనున్నాట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తమన్నా ఇదివరకే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సరిలేరు నీ కెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. అంతే ఈ సినిమాలో కూడా తమన్నా స్పెషల్ పాట చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts