telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ సీనియర్ లీడర్ టామ్ .. బీజేపీలోకి.. !

tam vadakkan joined in bjp today

కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల ముందు భారీ షాక్ తగిలింది. గతంలో సోనియా కార్యదర్శిగా పని చేసిన సీనియర్ లీడర్ టామ్ వడక్కన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మన సాయుధ బలగాల సమగ్రతను కాంగ్రెస్ అనుమానించడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని, అందుకే 20 ఏళ్లుగా ఉన్న ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు టామ్ వెల్లడించారు. బరువైన మనసుతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను. ఇది జాతి ప్రయోజనాలకు విరుద్ధం. ఎంతో బాధతో పార్టీకి వీడ్కోలు చెబుతున్నాను అని వడక్కన్ అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఓ రాజకీయ పార్టీ వ్యవహరిస్తుంటే.. ఆ పార్టీని వీడటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఇది సరి కాదు అని ఆయన స్పష్టం చేశారు.

టామ్ వడక్కన్, పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులపై కాంగ్రెస్ స్పందించిన తీరు తనకు ఏమాత్రం నచ్చలేదని అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై కూడా ఆయన మండిపడ్డారు. అసలు కాంగ్రెస్‌లో అధికారం ఎవరి చేతుల్లో ఉందో తెలియకపోవడం బాధాకరమని టామ్ చెప్పడం గమనార్హం. ప్రధాన నరేంద్ర మోదీ అభివృద్ధి నినాదాన్ని తాను బలంగా విశ్వసిస్తానని స్పష్టం చేశారు. బీజేపీలోకి తనను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పారు.

Related posts