telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అభివృద్ధి సజావుగా సాగాలనే.. సీఎల్పీ విలీనం.. : తలసాని

talasani srinivasayadav on clp merger

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ విలీనం గురించి స్పందించారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే సీఎల్పీ.. టీఆర్ఎస్‌లో విలీనం అయ్యిందని అన్నారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ చేపట్టిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను మంత్రి తప్పుపట్టారు. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని, అందుకే ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని ఎందుకు లాక్కున్నారని నిలదీశారు.

కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ ఎందుకు కలుపుకుందని అడిగారు. మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మడం లేదని తెలిపారు. బంగారు తెలంగాణ చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్షాలకు కూడా సమానంగా నిధులు కేటాయించినట్లు స్పష్టంచేశారు.

Related posts