తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ఆంధ్రావాళ్లంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారు: తలసాని

Details Of Property Talasani Srinivas

ఆంధ్రావాళ్లంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఓట్ల కోసమే సెటిలర్లను పొగడుతున్నామనేది సమంజసం కాదన్నారు. నాలుగేళ్లుగా వారంతా హైదరాబాద్ అభివృద్ధి చూశారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఉత్తమ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంటా? లేక చప్రాసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడే గెలిచినట్లుగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ దిక్కుమాలిన పార్టీ అంటూ ధ్వజమెత్తారు.

గతంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పుడు ఐదు వేలు పింఛన్ ఇస్తామన్నా నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లాగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు అమ్ముకోలేదని విమర్శించారు. టీఎస్‌‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. రాజీవ్‌ గృహ కల్ప పేరుతో కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేసి ఏం చేయలేకపోయారని ఆరోపించారు.

Related posts

ఉద్యమానికి సిద్ధం అవుతున్న ఉపాధ్యాయులు..జీతాలు పెంపు చేయాలట…

chandra sekkhar

బిచ్చగాడిని కొట్టి చంపిన ప్రముఖ మోడల్… కేసు నమోదు

nagaraj chanti

నేడే ఆఖరి వన్డే… విజయమా.. అడ్డంకులా..

chandra sekkhar

Leave a Comment