• Home
  • Trending Today
  • పెయిన్ కిల్లర్ వాడుతున్నారా…గుండె జర బద్రం..
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

పెయిన్ కిల్లర్ వాడుతున్నారా…గుండె జర బద్రం..

takecare with pain killers usage

ఈ హడావుడి జీవితంలో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చేది తెలియదు. ఒక్క రోజు ఉద్యోగానికి హాజరు కాకపోతే జీతంలో కోత ఉంటుందేమో అని అనారోగ్యంగా ఉన్నా ఏదో టాబ్లెట్ వేసుకొని వెళ్లడం అలవాటుగా మారిపోయింది. అయితే ఈ విధమైన సొంత వైద్యంలో సాధారణంగా మనం వాడివి పెయిన్ కిల్లర్స్. ఇవి ఇష్టానికి వాడేసి, తాత్కాలిక ఉపశమనానికి, జీవితాన్ని సాగించాలని అనుకుంటే పొరపాటే. తాత్కాలికంగా అది సరైనదే అనిపించినా ఒకనాడు హఠాత్తుగా పెద్ద అనారోగ్య సమస్యగా పరిణమించే అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఈ హడావుడి జీవితంలో తిండి తినటం అయినా మానేస్తున్నారు కానీ ఉదయాన్నే విటమిన్ టాబ్లెట్ లు మాత్రం వేసుకుంటున్నారు. అలాంటివి నేటి జీవితంలో సర్వసాధారణం అయ్యింది.

కానీ ఇలాంటి సొంత వైద్యలు ఏదో ఒక రోజు కొంప ముంచే రోగాల బారిన పడేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు వైద్యులు. అయితే ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడితే ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఇటీవల డెన్మార్క్ కు చెందిన వైద్య బృందం 63 లక్షల మంది పై చేసిన పరిశోధనలో తేల్చారు. వీరందరూ పెయిన్ కిల్లర్స్ తరచూ వాడేవారు.


మీ ఉప్పులో ఉప్పు ఉందా? ప్లాస్టిక్ ఉందా? ఒక్కసారి చూడండి…!

పంటి సమస్యతో బాధపడుతున్న సమయంలో… మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అంటూ ఓ ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీ ప్రకటనలు చూసే ఉంటారు… అయితే ఇప్పుడు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండటం దేవుడెరుగు కానీ ప్రస్తుతం ఉప్పులో ఉప్పు ఉందా? అన్నది పెద్ద సమస్యగా మారింది… మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పలు బ్రాండ్ కెంపెనీలకు చెందిన ఉప్పును వాడుతుంటాం… అయితే ఆ ఉప్పులో అతి స్వల్ప మోతాదు ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని బొంబాయి కి చెందిన ఐఐటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు..

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం), ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వారి ప్రాజెక్ట్ లో భాగంగా ఉప్పుపై అధ్యయనం చేశారు.. కాగా ఉప్పులో ప్లాస్టిక్ అవశేషాలు ఉండటం కారణంగా ఉప్పు దాని సహజ లక్షణాన్ని కోల్పోతుందని, ముఖ్యంగా సముద్రపు ఉప్పు లోనే ఈ ప్లాస్టిక్ అవశేషాలు మోతాదు శాతంలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది… కాగా వీరు చేసిన అధ్యయనంలో 626 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉండగా ప్లాస్టిక్ 63% ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉంటే 37% ఫైబర్ రూపంలో ఉందని తేలింది..

అంటే ఒక కేజీ ఉప్పులో 63.76 మైక్రో గ్రాములు అంటే 0.063 మిల్లీ గ్రాముల ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది… నిత్యం 5గ్రాముల ఉప్పు తీసుకుంటాం అంటే ఏడాదికి సగటున ప్రతి భారతీయుడు 117 మైక్రోగ్రాములు 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ ని తమకు తెలియకుండానే తీసుకుంటున్నారు.. 60 సంవత్సరాల్లో ఒక్కొక్కరు 7.20 గ్రాముల అతి హానికారకమైన ప్లాస్టిక్ ని తెలియకుండానే జీర్ణించుకుంటున్నారు.. ఇకపై ఉప్పు అధికంగా తీసుకునే వారికి ఇదొక షాక్ అనే చెప్పుకోవాలి… జాగ్రత్తగా ఉంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి..


చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?

రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి, ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వాష్ రూమ్ కు వెళ్లాలి.

ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు, ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుంది ఇంకా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పైన చెప్పిన నియమాన్ని అందరూ పాటించండి మరియు మనవాళ్లoదరికీ ఈ విషయం తెలపండి.


 

Related posts

తారు మారు…

chandra sekkhar

విజయ్ దేవరకొండ న్యూ మూవీ లాంచ్..’చిత్రాలు’..

chandra sekkhar

కేరళలో వేలాది ఉద్యోగాలకు ఎసరు…ఇక అన్నిచోట్లా రోబోలే…

chandra sekkhar

Leave a Comment