Tag : Health News

Trending Today ఆరోగ్య వార్తలు రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

యూపీలో అంతు చిక్కని జ్వరం…79 మృతి…హై అలర్ట్ ప్రకటన…

chandra sekkhar
ఇటీవల దేశంలో అంతుచిక్కని రోగాలు ఎక్కువ అవుతున్నాయి. కేరళలో నిఫా వైరస్ మరిచిపోకముందే యూపీలో మరో విషజ్వరాలు తలెత్తాయి. ఒళ్ళంతా విపరీతంగా కాలిపోతుందని ఆసుపత్రికి వెళ్లి చూపించుకున్న ఫలితం లేకుండా పోతుంది. ఏమంటే అది ఏమితో
ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు

ముందస్తు దంతవైద్య పరీక్షలు అవసరమా?

jithu j
ఆరోగ్యమే మహాభాగ్యం .. అన్నది లోకోక్తి . అయితే ,ఆ మహాభాగ్యాన్ని మూటకట్టుకునే అదృష్టవంతులు మన సమాజంలో ఎంతమంది? అని మనకు మనం ప్రశ్నించుకుంటే, సమాదానం పెద్ద హర్షించేదిగా వుండకపోవడమే! దానికి కారణం. సమస్య
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు వార్తలు & టిప్స్ సాంకేతిక సామాజిక

ఆధునిక దంత చికిత్సా విధానాలలో ‘పన్ను తీయడం’ అనేది ఆఖరి ప్రక్రియ…

chandra sekkhar
రోజులు మారాయి ! చికిత్సా పద్ధతులూ మారాయి. ఇబ్బందులను తగ్గించి సుఖ జీవన యానానికి బంగారు మార్గాలు తెరుచుకుంటున్నాయి. పంటి నొప్పి అనగానే పన్ను తీయించుకోడం (extraction)అనేది ఒకనాటి మాట ! ఇప్పటి పరిస్థితులు వేరు.
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

పెయిన్ కిల్లర్ వాడుతున్నారా…గుండె జర బద్రం..

chandra sekkhar
ఈ హడావుడి జీవితంలో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చేది తెలియదు. ఒక్క రోజు ఉద్యోగానికి హాజరు కాకపోతే జీతంలో కోత ఉంటుందేమో అని అనారోగ్యంగా ఉన్నా ఏదో టాబ్లెట్ వేసుకొని వెళ్లడం అలవాటుగా
ఆరోగ్య వార్తలు

మొబైల్ ఫోన్లతో పొంచి ఉన్న ప్రమాదం…!?

admin
రోజులు మారుతున్నాయి… సాంకేతిక పరిజ్ఞానం కూడా రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. చేతిలో ఫోన్ లేనిదే రోజు గడవదు… ఏం తోచదు కూడా ఈ తరం యువతకు. ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఫోన్, క్యాబ్ బుక్
వార్తలు & టిప్స్

భోజనం తరువాత నీరు తాగొచ్చా?

admin
అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు. “భోజనాంతే విషం వారీ” అంటే భోజనం చివర నీరు త్రాగటం “విషం”తో సమానం. మనం తీసుకున్న
ఆరోగ్య వార్తలు

మామిడి పండ్లను తింటే కలిగే లాభాలివే…!

admin
వేసవి కాలం వచ్చిందంటే పండ్లలో రారాజు మామిడిపండ్ల కాలం వచ్చినట్లే… పసుపుపచ్చ రంగులో చూడగానే నోరూరించేలా ఉంటాయి మామిడిపళ్ళు. వేసవిలో మాత్రమే విరివిగా దొరుకుతాయి. మరి వీటిని తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

ఎండాకాలంలో చర్మాన్ని సంరక్షించండిలా…

admin
ఎండాకాలం వచ్చిందంటే చర్మానికి చాలారకాల సమస్యలు వచ్చిపడతాయి. ముఖ్యంగా చర్మం జిడ్డుగా తయారవడం, ఎండకు చర్మం కందిపోవడం వంటివి జరుగుతాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన చర్మాన్ని ఎండనుంచి సంరక్షించుకోవచ్చు. * వీలైనంత
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

నీరు…

admin
నీరు ప్రాణకోటికి ఆధారం. మానవ శరీరానికి కూడా నీరు అంతే ముఖ్యం. మానవ శరీరంలో 80 శాతం నీరు ఉండటమే దీనికి నిదర్శనం. మరి శరీరానికి అవసరమైన మేరకు నీరు అందించడం ఎలా..?  రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తాగమని పెద్దలు చెబుతూనే ఉంటారు. శరీరానికి మనంఅందించే ఆహారంలో ఘన పదార్దాలతో పాటు ద్రవ పదార్దాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడంలోని ప్రాముఖ్యత శరీరంలో నీటి అవసరాలను తీర్చడం కోసమే.  ద్రవ పదార్దాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది శీతల పానీయాలు.  కానీ శరీర నీటి అవసరాలు ఈ పానియాలు తీర్చలేవు సరికదా వీటివల్ల రకరకాల దుష్ప్రయోజనాలు తలకెత్తుకున్నట్టే. వీటి బదులుగా ఆయా కాలాలలో లభించే పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిది. పండ్ల రసాలుఅనగానే వీధి బండ్లలో చేతికొచ్చినంత చక్కెర, ఐస్ వేసి తాగితే అవికూడా ప్రమాదకరమే. ఇళ్లలో ఉన్నపుడు పండ్ల రసాలు చేసుకు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా… దానికి అనుగుణంగా వీలైనప్పుడుపండ్ల రసాలు, అవి అందుబాటులో లేని సమయాలలో (ఉదాహరణకి ఆఫీస్ లోనో లేక పనిమీద వేరే చోటో ఉన్నపుడు) నీరు తాగుతూ శరీర నీటి అవసరాలను సమతుల్యం చేస్తూ ఉండాలి.  ఆయా కాలాలకు అనుగుణంగా నీటిని శరీరానికి అందించాలి. ఉదాహరణకి వానాకాలం అనుకోండి, ఆ కాలంలో నీటిని గోరువెచ్చగా తీసుకుంటే మంచిది. ఏకాలంలో అయినా నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలి.  నీటి అవసరం ఏ వయసు వారికైనా ఒకే విధంగా ఉంటుంది. నీరు తాగటం వల్ల శరీరం తనలోని రకరకాల వ్యవస్థలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తుంది. అటువంటి ప్రక్రియ జరగటం వల్లనే నిత్యం ఎన్నో వ్యర్దాలు తయారయ్యే శరీరంలో శుభ్రత జరిగి శరీరం ఆరోగ్యంగా ఉండగలదు. ఈ అంతరశుద్ధి జరగటం మన జీర్ణవ్యవస్థకు, రక్త శుద్ధికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా ఆయా వ్యవస్థల పనితీరులో లోపాలు చోటు చేసుకోకుండా ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో నీరు తగ్గితే ఏమవుతుంది.. ఊరికే ఆలోచిద్దాం. మనకు సాధారణంగా తలనొప్పి వచ్చి తల్లడిల్లిపోతాం .. దీనికి  ఒక కారణం శరీరానికి తగిన నీరు అందించకపోవడమే. మలబద్దకం.. దీనికి కూడా ప్రధాన కారణం శరీరంలో నీటి అవసరం తీర్చలేకపోవడమే.  దీనిని అరికట్టడానికి పొద్దున్నే తాగగలిగినన్నినీళ్లు (కనీసం లీటరు నీరు) తాగితే, లోనికి వెళ్లిన నీరు దాని పని అది చేసుకుపోతుంది. మొదట్లో వట్టి నీరు తాగాలి అనిపించకపోవచ్చు అందుకని అందులో కొంచం ఉసిరిపొడి లేదా నిమ్మకాయ రసం పిండుకొని తాగండి రుచికి రుచి, ఆరోగ్యానికిఆరోగ్యం.  ఇక మిగిలిన సమయాలలో అయితే అల్పాహారం తరువాత ఒక గంట ఆగి కొంచం దాహంగా అప్పటికే అనిపిస్తుంది అది గమనించి తగినన్ని నీరు తాగాలి. ఇక భోజనం తరువాత రెండు గంటల తరవాత గాని నీరు తాగకూడదు. తిన్నాక దాహం వేస్తె కొంచంగా అంటే ఒకటో రెండో గుక్కలు తాగిసరిపెట్టుకోవాలి. సాయంత్రం అదే రెండవ సారి అల్పాహారం తీసుకునే సమయంలో వారివారి శరీర అవసరాలకు అనుగుణంగా పండ్ల రసాలు తాగటం మంచిది. యధావిధి అల్పాహారం తరువాత గంట ఆగి దాహానికి తగ్గట్టు నీరు తాగాలి. నీరు ఎండాకాలంలో ఎక్కువ తాగాలని లేదు. సాధారణ ఋతువులలో తగినట్టే తాగుతూ వేసవిలో లభ్యమయ్యే కూరగాయలను, పండ్లను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా వేసవి తాపానికి గురికాకుండా శరీరం మన రోజు వారి కార్యక్రమాలకు ఉత్సహంగా సహకరిస్తుంది.  నీటిని తీసుకునే అలవాటు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి బలవంతంగా తాగరాదు. నీటిని ఉదయం నుండి సాయంత్రం 6 గంటలవరకు మాత్రమే తాగాలి అని పెద్దలు చెపుతారు. ఈ నీటిని తీసుకునే ప్రణాళిక నిత్యం అనుసరించాలి. ముఖ్యగమనిక ఈ విశ్వంలో ఎటుచూసినా నీరే ఉందికదా నీటిని జాగర్తగా వాడుకోండని ఎందుకు ఇంత భారీ ప్రచారం చేస్తున్నారు అని చాలా హాస్యప్రదమైన సందేహం వస్తుంది.  మన చుట్టూ ఉన్న నీటిలో 3 శాతం మాత్రమే తాగడానికి అనువైనది, అందులోను 1 శాతమే అందుబాటులో ఉంది.మిగిలిన 2 శాతం మంచు రూపేణా తాగడానికి అనువుగా లేకుండా పోయింది. అందుకే 84 కోట్ల జీవరాశులకు ఆధారం నీరే, అటువంటి నీటిని జాగర్తగా వాడుకుని, నీరు అనే సహజ సంపదను తరువాత తరాలకు అందచేయడానికి కృషి చేద్దాం. నీరు ప్రాణకోటికి ఆధారమే, జాగ్రత్తగా వాడుకుని అందరం బ్రతుకుదాం… బ్రతకనిద్దాం… -చంద్రశేఖర్ రెడ్డి