telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఎవరైనా ఆపదలో ఉంటె… ఇలా చేసేయండి.. కాస్త మానసికాస్తైర్యం కావాల్సిందే..

Crime

అమ్మాయిలు ఆపదలో ఉన్నారని భావిస్తే వెంటనే ఈ పనులు చేయాలి…ఈరోజుల్లో ప్రతి ఒక్కరితోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా ఉంటోంది. కాబట్టి మీరు మీ ఫోన్ లో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జిపిఎస్)ను ఆన్ లో ఉంచుకోవాలి. అలాగే ఇంటర్నెట్ ను కూడా ఆన్ లో ఉంచుకోవాలి. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో 112 అనే ఫోన్ నెంబర్ ను సేవ్ చేసి ఉంచుకోవాలి. ఇది ఎమర్జెన్సీ నంబర్. దీనికి ఫోన్ చేసినా మీ ఫోన్ జిపిఎస్ ఆధారంగా లొకేషన్ ను ట్రాక్ చేసి పోలీసులు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ ఫోన్ లో 112 సేవ్ చేసుకున్న అనంతరం మీరు ఆపదలో ఉన్నట్లు అనిపించినా, అగ్ని ప్రమాదాలకు సంబంధించినా లేదా మెడికల్ ఎమర్జెన్సీతో పాటు ఇంకా ఏదైనా సరే వెంటనే 112 నెంబర్ కు ఫోన్ చేయాలి. అలాగే ఆ నెంబరును కూడా మీ హోమ్ స్క్రీన్ లో షార్ట్ కట్ లో ఉంచుకోండి. వీటితో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు 100, 1090, 181, 1091 నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.

మీరు ఎవరికి ఫోన్ చేసే పరిస్థితిలో లేకపోయినా మీరు ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. అది ఎలాగంటే మీ స్మార్ట్ ఫోనులోని పవర్ బటన్ లేదా లాక్ బటన్ ను వెంట వెంటను మూడు సార్లు ప్రెస్ చేసినా కూడా ఎమర్జెన్సీ నెంబర్ కు ఆటోమేటిక్ గా కాల్ వెళ్తుంది. మీరు ఏదో ప్రమాదంలో లేదా ఆపదలో ఉన్నారని పోలీసులకు నిర్ధారణకు వస్తారు. జిపిఎస్ ఆధారంగా మీరున్న ప్రాంతానికి చేరుకుని మిమ్మల్ని రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లేదా ఒకవేళ మీతో స్మార్ట్ ఫోన్ లేకుండా సాధారణ ఫోన్ ఉంటే మీరు అప్పుడు ఫోన్ చేసే పరిస్థితిలో లేకపోతే మీరు ఇలా చేయాలి. మీ ఫోన్ లో ‘5’ నెంబర్ ను లేదా ‘9’ నెంబర్ గట్టిగా నొక్కాలి. దాని వల్ల కూడా ఆటోమేటిక్ గా మీ కాల్ అనేది పోలీసులకు కనెక్ట్ అవుతుంది. దీని వల్ల కూడా పోలీసులు మీరు ఉన్న ప్రాంతాన్ని ట్రాకింగ్ చేసి మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాలికలు, యువతులు ఏదైనా ఆపద సంభవించినప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నట్లు భావించినపుడు లేదా ఎవరైనా ఆకతాయిల వేధింపునకు గురైనట్లు భావిస్తే వెంటనే పై నెంబర్లకు ఫోన్ చేయాలి. మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకుని మిమ్మల్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది.

Related posts