telugu navyamedia
సినిమా వార్తలు

“దేదే ప్యార్ దే” రీమేక్… వెంకీ సరసన టబు

Tabu

ఇటీవల హిందీలో విడుదలైన “దే దే ప్యార్ దే” చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్, రకుల్, టబూ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమైంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబూ చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది తాజా సమాచారం. 28 ఏళ్ల క్రితం “కూలీ నెం.1” సినిమాలో వెంకీ జోడీ కట్టిన టాబూ, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుందన్న మాట. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారా ? లేదంటే మరొకరిని ఎంపిక చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Related posts