telugu navyamedia
సినిమా వార్తలు

అందుకే సినిమాలు చేయనన్నాను – టబు

Tabu

బాలీవుడ్‌ నటి టబు… ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓ నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారామె. ఈ సందర్భంగా “లివింగ్‌ ఆన్‌ మై ఓన్‌ టర్మ్స్‌” అనే అంశంపై ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌లో తనకెన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయంటూ… ఈ నగరాన్ని వదిలి వెళ్లకూడదన్న ఒకే ఒక్క కారణంతో తాను తొలుత సినిమాలు కూడా చేయనన్నానని తెలిపారు. అయితే ఇప్పుడు ముంబైలో నివాసముండటానికి సినిమాలే కారణమన్నారు. తెలుగు సినిమాల్లో చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనన్న ఆమె తన సినీ ప్రయాణం ఓ తెలుగు సినిమాతోనే ప్రారంభమైందని, ఆ సినిమా ద్వారా తానెంతో నేర్చుకున్నానని టబు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును తన గురువని, హైదరాబాద్‌తో తన కనెక్షన్‌ను ఎప్పటికీ నిలిచే ఉంచే ప్రయత్నం చేస్తానన్నారు. అంతకు ముందు ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా ప్రియాంక గనేరివాల్‌ అరోరా నుంచి సోనా ఛత్వానీ బాధ్యతలను స్వీకరించగా, యంగ్‌ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ చైర్‌పర్సన్‌గా వినీతా సురానా నుంచి శిల్పా దాట్ల బాధ్యతలను స్వీకరించారు.

Related posts