telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా నడుం పట్టుకోవాలని చూశాడు… వేలు విరిచేశా… : తాప్సి

Taapsee

సినీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘గురునానక్ జయంతి రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. ఓసారి నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధి చెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను” అని తెలిపారు. ప్రస్తుతం తాప్సి చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సి నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మిథాలీగా తాప్సి చాలా బాగా కనిపించారు. దీంతో పాటు ఆమె ‘తప్పడ్’, ‘రాకెట్ రష్మి’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.

Related posts