telugu navyamedia
సినిమా వార్తలు

రహస్యంగా తాప్సి ఫోటోలు… చంపేస్తుందేమో అని భయపడిందట…!

Taapsee who killed the user by tweet

కొంతమంది తారలు రీల్ లైఫ్ పాత్రల్లో ఎంతగా లీనమైపోతారంటే… ఒక్కోసారి వారి నిజ జీవితంలో కూడా ఆ పాత్రల్లాగే ప్రవర్తిస్తుంటారు. హీరోయిన్ తాప్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాప్సీ హీరోయిన్ గా “మన్మర్జియా” అనే సినిమాలో నటించింది. గత ఏడాదిలో విడుదలైన ఈ సినిమాలో తాప్సీ చాలా గంభీరంగా కన్పించింది. ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే కొట్టిపడేస్తుంది. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తాప్సి తన సోదరితో కలిసి బయటకి వెళ్లిందట. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రహస్యంగా తాప్సి ఫోటోలు తీశాడట. అది గమనించిన తాప్సి కోపంగా అతని వద్దకు వెళ్లి ఫోన్ లోపల పెడతావా..? లేక పగలగొట్టనా..? అని బెదిరించిందట. దీంతో ఆ ఫోటోలు తీసిన వ్యక్తి అక్కడ నుండి పారిపోయాడట. తాప్సి సోదరి మాత్రం భయపడి తనకు ఏమీ తెలియనట్లుగా ఉండిపోయిందట. ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పుకొచ్చింది తాప్సి. ఇక “బద్లా” సినిమాలో నటిస్తోన్న సమయంలో ఆ సినిమాలో మాదిరి నిజజీవితంలో కూడా ఎవరినైనా చంపేస్తానేమోనని తాప్సి సోదరి భయపడేవారట.

Related posts