telugu navyamedia
news telugu cinema news trending

సైరా ట్విట్టర్ రివ్యూ .. బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసలు..

Syeraa

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల కానుంది. ఏపీలో ఇప్పటికే బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. తెలంగాణలో ఉదయం 8 గంటలకు తొలి షో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌లో గత రాత్రే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ‘సైరా’ సినిమాను ప్రదర్శించారు. ఇక, అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చూసినవారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. సినిమాలోని డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నాల నటన కూడా అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు.

Related posts

పోలవరం నుంచి తప్పుకోవాలని ‘నవయుగ’ సంస్థకు నోటీసులు

vimala p

టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు .. పాక్ లోనే.. పట్టిస్తే 7 కోట్ల బహుమతి : అమెరికా

vimala p

ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ: సీఎం జగన్

vimala p