telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు

Syeraa

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘U/A’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్న విషయం తెలిసిందే. ప్రీరిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు కొల్లగొడుతుండనై ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎలాంటి ఆఫర్స్ లేకపోయినా ఎగబడి టికెట్స్ కొంటున్నారు. ఇప్పటికే అక్కడ లక్ష డాలర్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. పూర్తిగా బుకింగ్స్ మొదలైతే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో బాహుబలి -2 టాప్‌లో ఉంది. సైరా ప్రీమియర్స్‌తో రెండు మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇక సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక రికార్డులు సృష్టించం ఖాయం. ఇప్పటికే మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రీమియర్స్ ద్వారా మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది.

Related posts