telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరికొద్దిసేపట్లో “సైరా” టీజర్

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేస్తున్నారు. ఈ టీజర్‌కి జనసేనాని పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిత్ర టీజ‌ర్‌ని ఈ రోజు మ‌ధ్యాహ్నాం 2.40 ని.ల‌కి ముంబై విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. చిత్ర‌ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతుంద‌ని అంటున్నారు.

Related posts