telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” చిత్రీకరణను ఆపేసిన ముస్లిమ్ యువకులు

Syeraa

సైరా వంటి భారీ చిత్రంతో మరోసారి తెలుగు సినీపరిశ్రమ బాక్స్ ఆఫీస్ వద్ద తన ఖ్యాతిని పరీక్షించుకోబోతుంది. ఈ భారీ చిత్రంలో నటీనటులు ఏరికోరి మరి ఎంచుకుంటున్నారు. అగ్రనేతలు అందరు ఒక తెరపై కనిపిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “సైరా” చిత్రం తాజా షెడ్యూల్ బీదర్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేశారు చిత్రబృందం. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కొందమంది ముస్లిమ్ యువకులు సినిమా చిత్రీకరణను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సినిమా షూటింగ్ బహుమనీ సుల్తాన్ కోటలో జరుగుతోంది. అది ముస్లిం ప్రార్థనాలయం కావడంతో అక్కడ హిందువుల దేవతా విగ్రహాలు ఉంచొద్దంటూ ముస్లిం యువకులు గుంపుగా వచ్చి షూటింగ్ ను అడ్డుకున్నారట. బీదర్ జిల్లా అధికారి నివాసం ముందు ఈ ముస్లిం యువకులు కోటలో ఉన్న హిందువులకు సంబంధించిన విగ్రహాలను తొలగించాలంటూ ఆందోళన చేపట్టారని సమాచారం. అంతేకాదు సినిమా డైరెక్టర్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ లపై కేసు పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షూటింగ్ కోసం వేసిన సెట్ ను, విగ్రహాలను తొలగించారని తెలుస్తోంది.

Related posts