telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” విడుదల తేదీ ఇదే…?

Syeraa

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌, జగపతిబాబు, నయనతార, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

అమిత్‌ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి అనుకున్న పనులు పూర్తికావనే ఉద్దేశంతో అక్టోబర్ 2కు విడుదల తేదీని మార్చినట్టుగా వార్తలు వచ్చాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం, స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన కథ కావడం వలన అక్టోబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే అక్టోబర్లో విడుదలకి ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలు, సంక్రాంతి వైపుకి వెళుతున్నాయని అంటున్నారు.

Related posts