telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘శ్యామ్ సింగరాయ్’ గా నాని … క్రొత్త సినిమా

Nani

మార్చి 25న `వి` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న నాని.. త‌న 26వ చిత్రంగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది నానికి 27వ సినిమా. సోమ‌వారం పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీకి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్ పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది. 

Related posts