• Home
  • వార్తలు
  • తెలంగాణాలో మళ్ళీ పెరుగుతున్న…స్వైన్ ఫ్లూ కేసులు…
Trending Today ఆరోగ్య వార్తలు రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణాలో మళ్ళీ పెరుగుతున్న…స్వైన్ ఫ్లూ కేసులు…

swine flu cases raised in telangana

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరగటంపై అధికారులలో ఆందోళన నెలకొంది. దీనితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా, ఫ్లూ లక్షణాలు ఉన్న అందరి శాంపిళ్లను తీసి నారాయణ గూడలోని ఐపీఎంకు పంపాలని జిల్లా ఆసుపత్రులకు ఆదేశించింది. ఆయా విషయాల పర్యవేక్షణ కోసం స్టేట్ నోడల్ టీం లను నలుగురు వైద్యులతో ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసులను ఏ,బి,సి కేటగిరీలుగా విభజించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయా కేటగిరీలకు తగ్గట్టుగా పరీక్షలు, వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలలో ని ఆసుపత్రులలో బాధితులకు చికిత్స నిమిత్తం ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అలాగే మందులు కూడా అందుబాటులో ఉంచారు.

Related posts

నేపాల్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

jithu j

‘న‌ట‌న’ టీజ‌ర్, టైటిల్ సాంగ్ విడుద‌ల‌

jithu j

క్షీణించిన వై వీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

admin

Leave a Comment