telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు వ్యాపార వార్తలు

ఉద్యోగాల కల్పనలో .. ముందుంటున్న స్విగ్గి..

swiggy providing more jobs

ఆహార సంస్థ స్విగ్గి ఉద్యోగాల కల్పనలో ముందుకు దూసుకుపోతుంది. స్విగ్గిలో ఇప్పటికే రెండు లక్షల మంది పనిచేస్తున్నారని యాజమాన్యం తెలిపింది. రానున్న 18 నెలల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తుందట స్విగ్గి. తాజా నిర్ణయంతో స్విగ్గి ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతుంది. ఒకవేళ స్విగ్గి అనుకున్నట్లు 18 నెలల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న మూడో అతిపెద్ద సంస్థగా స్విగ్గి నిలువబోతుంది .

గతేడాది గణాంకాల ప్రకారం భారత సైన్యం 12.5 లక్షల ఉద్యోగాలు కల్పించి ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పించిన సంస్థలో మొదటి స్థానంలో ఉండగా… రైల్వే 12 లక్షల ఉద్యోగాలు కల్పించి రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో ఐటీ సేవల సంస్థ టిసిఎస్ 4.5 లక్షలు ఉద్యోగాలు కల్పించి మూడో స్థానంలో ఉంది. స్విగ్గి వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీహర్ష మెజెటి తన సంస్థలో కల్పించాలనుకున్న ఉద్యోగాలు వివరాల గురించి తెలుపుతూ…. అనుకున్న విధంగా 18 నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తే దేశం లోనే భారీ ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల్లో సైన్యం, రైల్వే తర్వాత మూడో స్థానంలో స్విగ్గి ఆవిర్భవించడం సాధ్యమని అంటున్నారు.

Related posts