telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కారులో చెలరేగిన మంటలు..ప్రయాణీకులు సురక్షితం

Mojamjahi Market Fire Accident

సికింద్రాబాద్ బొయిన్‎పల్లి డైరీఫాం రోడ్డులో ఓ కారు మంటల్లో చిక్కుకుంది. డైరీఫార్మ్ నుండి సుచిత్ర వెళ్తున్నస్విఫ్ట్ కారులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టీఎస్10 యూబీ3647 స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‎లో వేడి ఎక్కువై ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది..ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది.

Related posts