telugu navyamedia
telugu cinema news trending

ఘనంగా శ్వేతాబసు ప్రసాద్ పెళ్ళి

Swetha-Basu-Prasad

ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్ళికాని సెలెబ్రిటీల మనసంతా పెళ్ళివైపు మళ్ళుతోంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలతో మొదలైన పెళ్ళి బాజాలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ వివాహం పూణేలో ఘనంగా జరిగింది. నిన్నరాత్రి సన్నిహితుల సమక్షంలో దర్శకుడు రోహిత్ మిట్టల్, శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్ళి వేడుకలో శ్వేతాబసు ప్రసాద్ పింక్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఈ సందర్భంగా రెండు కుటుంబాలకు చెందినవారు తమతమ డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను శ్వేతాబసు, రోహిత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. శ్వేతాబసు “మక్డీ” అనే చిత్రంలో బాలనటిగా నటించి జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళావర్ కింగ్ అనే సినిమాల్లో నటించింది శ్వేతాబసు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె పలు టీవీ సీరియల్స్ లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

Related posts

రాజధానిలో.. ఎమ్మెల్యే క్వార్టర్స్ .. పై చంద్రబాబు సమీక్ష..

vimala p

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

vimala p

ఐపీఎల్ : దిల్లీని.. ఘోరంగా ఓడించిన .. చెన్నై..

vimala p