telugu navyamedia
ఆరోగ్యం

స్వయంతృప్తి ప్రమాదకరమా ?

water importance in sex

నాకు స్వయంతృప్తి అలవాటు ఉంది. అయితే నేను అతిగా ఈ పని చేస్తున్నానని అనిపిస్తోంది. అసలు దీనికి లెక్క అంటూ ఉందా? ఎన్నిసార్లు చేస్తే ఆరోగ్యానికి హానికరం?

 స్వయంతృప్తి అనేది ఆరోగ్యకరమైన, సహజసిద్ధమైన లైంగిక చర్య. అయితే ఈ అలవాటు మీ దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నా లేదా మీ జీవిత భాగస్వామితో లైంగిక జీవితానికి అడ్డంకిగా మారినా, కచ్చితంగా సెక్సాలజిస్ట్‌ సలహా తీసుకోవాలి. అధిక శాతం మంది స్వయంతృప్తితో తమ లైంగిక కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ అలవాటు వల్ల లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయి, గర్భం దాలుస్తామనే భయాలూ ఉండవు. కాబట్టి ఎవరైనా స్వయంతృప్తి జరపకుండా లైంగిక కోరికలను అణుచుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ అలవాటు దైనందిన జీవితానికి, లైంగిక సంబంధాలకూ ఇబ్బందికరంగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించండి.

 ఒకవేళ ఈ అలవాటు వల్ల జననావయవాలకు గాయాలవుతున్నా ఈ అలవాటును అదుపు చేసుకోక తప్పదు. స్వయంతృప్తి కోసం నిర్దేశించిన సురక్షితమైన సెక్స్‌ టాయిస్‌ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయు. కాబట్టి వైద్యుల సూచన మేరకు వాటిని వాడటం అన్ని విధాలా శ్రేయస్కరం.

Related posts