telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇకనైనా .. కశ్మీర్ లో ఉన్న .. సరస్వతీ పీఠాన్ని పునరుద్ధరించాలి..

swarupananda swami on J & K issue

విశాఖపట్టణంలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశ సమగ్రతకు, జమ్ముకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని అన్నారు.

భారత ప్రభుత్వం కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు పూనుకుంటే కనుక శారదా పీఠం సహకరిస్తుందని చెప్పారు. రామజన్మభూమి, గో సంరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. భారతదేశ అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా ‘గోవు’ను ప్రకటించాలని, అలా చేస్తే, మోదీని అభినవ వివేకానందుడిగా హిందువులందరూ కీర్తిస్తారని వ్యాఖ్యానించారు.

Related posts