telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్రేకప్

Swara Bhaskar

టాలెంటెడ్ యాక్ట్రస్ స్వర భాస్కర్ బ్రేకప్ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్వర భాస్కర్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. 31 ఏళ్ల స్వర భాస్కర్, హిమన్షు శర్మ అనే జాతీయ అవార్డ్ అందుకున్న రచయితతో అయిదేళ్ల నుంచీ రొమాన్స్‌లో మునిగి తేలుతోంది. హిమాన్షుతో స్వర ప్రేమాయణం “రాంజానా” సినిమా టైంలో మొదలైంది. ఆ తరువాత “తనూ వెడ్స్ మనూ” సినిమా షూటింగ్ సమయంలో సీరియస్ డేటింగ్ చేస్తూ తమ రిలేషన్ ను బయటపెట్టారు. ఇంతకీ… స్వర, హిమాన్షు శర్మ బ్రేకప్‌కి కారణం ఏంటనేది బాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. స్వర, హిమాన్షు కూడా రీజన్ ఏంటనేది అఫీషియల్‌గా చెప్పటం లేదు. అయితే వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకోవడంతో ఇకపై మంచి మిత్రులుగా కొనసాగుతారట. అయితే ఈ మాజీ లవర్స్ మధ్య వచ్చిన అసలు ప్రాబ్లం ఇదేనంటూ ఓ వెబ్‌సైట్ మాత్రం కథనం ప్రచురించింది. దాని ప్రకారం అయిదేళ్ల డేటింగ్ తరువాత స్వర పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టిందట. కానీ, హిమాన్షు తనకు అలాంటి ఉద్దేశం లేదని తెగేసి చెప్పాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Related posts