telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాలుగేళ్ళ బాలుడిపై హీరోయిన్ ఫైర్… వివాదాస్పదమవుతున్న వ్యాఖ్యలు

Swara Bhakar Comments on Modi

వివాదాస్పద నటి స్వర భాస్కర్ మరో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ నాలుగేళ్ల బాలుడిపై బూతుల వర్షం కురిపించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరీర్ ఆరంభం నుంచే వివాదాస్పద నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా ‘సన్ ఆఫ్ అభీష్’ చాట్ షోలో పాల్గొంది. తన కెరీర్ అరంభంలో జరిగిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ గురించి మాట్లాడింది. నాలుగేళ్ల చిన్నారితో కలిసి స్వరా ఆ యాడ్‌లో నటించింది. ఆ యాడ్ షూటింగ్ సందర్భంగా ఆ బాలుడు స్వరాను ‘ఆంటీ’ అని పిలిచాడట. దానిని గుర్తు చేసుకున్న స్వరా ఆ బాలుణ్ని నోటికొచ్చినట్టు బూతులు తిట్టింది. ఆ షూటింగ్ తనకు చాలా నిరాశ కలిగించిందని, బాలుడు తనను ‘ఆంటీ’ అని పిలవడమేంటని ప్రశ్నించింది. అంతేకాదు ‘పిల్లలు దెయ్యాలతో సమానం కదా?’ అంటూ వ్యాఖ్యానించింది. స్వర చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని కెమెరా ముందు దారుణంగా తిట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వరా వ్యాఖ్యలపై ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ బాలల హక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Related posts