telugu navyamedia
సినిమా వార్తలు

గొప్పేముంది ? అంటూ మోడీపై హీరోయిన్ కామెంట్స్

Swara Bhakar Comments on Modi
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులతో విజృంభించింది. ఈ మెరుపు దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ రోజు రాత్రంతా మోడీ అసలు నిద్ర పోలేదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందిస్తూ “మోడీ రాత్రంతా నిద్రపోలేదా… అందులో గొప్ప ఏంటి ? అది ఆయన ఉద్యోగంలో భాగం” అంటూ ట్వీట్ చేసింది. ఇలాంటి సమయంలో స్వర భాస్కర్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. “మీరు 18 గంటలు పనిచేస్తారా ? లేదు… ఎందుకంటే మీకు అసలు పనే దొరకడం లేదు… మీరు అర్బన్ నక్సలైట్ లా తయారయ్యారు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఆ ట్వీట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ స్వర భాస్కర్ మాత్రం ఇప్పటి వరకు ఆ ట్వీట్ ను డిలీట్ చేయలేదు. మరి నెటిజన్లు ఊరుకుంటారా ?

Related posts