telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

AP Congress candidates list release shortly
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్‌లను అనర్హలుగా ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు మండలి ఛైర్మన్ తేల్చడంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు.రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్‌ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళి రాజీనామాను ఇప్పటికే ఆమోదం తెలిపారు.టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌ మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 191(2) ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకున్నట్లు మండలి ఛైర్మన్‌ వెల్లడించారు.

Related posts