telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విష్ణుమూర్తితో పోల్చటం జగన్ కే ప్రమాదం…

cm jagan ycp

ఏపీ సీఎం జగన్‌పై కాకినాడ శ్రీపీఠం అధిపతి, భాజపా నేత స్వామి పరిపూర్ణనంద సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను రమణ దీక్షితులు విష్ణు మూర్తితో పోల్చటం జగన్ కే ప్రమాదమని.. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుంది… కానీ రాజునే విష్ణువుగా పోల్చకూడదని.. స్వామి పరిపూర్ణనంద అన్నారు. సీఎం జగన్ దీన్ని ఖండించాలని.. తిరస్కరిస్తునట్లు ప్రకటించాలని హెచ్చరించారు. ఒక వ్యక్తిని దేవుడితో పోల్చటం ప్రమాదకరమని.. వైకాపా నాయకులు జగన్ కి పూజలు చేయలేరు కదా? అని ప్రశ్నించారు. వైకాపా నాయకులు రమణ దీక్షితుల వ్యాఖ్యలను తిరస్కరించాలని.. తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే లేదన్నారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందని… తితిదే బోర్డు రాజకీయాల అడ్డాగా మారిపోయిందని ఫైర్‌ అయ్యారు.

దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతంలో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని.. అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. సీఎం జగన్ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? సమాచార హక్కు చట్టం పరిధిలోకి తితిదే ని ఎందుకు తీసుకురారు?, అవినీతి, అక్రమాలు బయటపడతాయని భయమా? అని నిలదీశారు. తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఈ ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయానని దేవాదాయ మంత్రి చెప్పినా సీఎం జగన్ స్పందించరా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ హిందువు కాదు… క్రైస్తవుడు… అందులో సందేహం లేదని… జగన్ హిందువునని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో తితిదే బోర్డు ఏర్పాటు చేయలేరా? రాయలసీమ ఆధ్యాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని ఫైర్‌ అయ్యారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు.

Related posts