telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్ధ ద‌శాబ్ధం తరువాత మెగా ఫోన్ పట్టనున్న ఎస్వీ కృష్ణా రెడ్డి

SVK

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాలు ఫ్యామిలి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చుట్టు ప‌క్క‌ల ప‌రిస్థితుల‌ని క‌ళ్ళ‌కి క‌ట్టిన‌ట్టు చూపిస్తూ సహజ హాస్యం, భావోద్వేగ విషయాలతో నిండి ఉండే ఆయన సినిమాలు చిన్న పిల్ల‌లను కూడా ఆకట్టుకుంటాయి. 90ల కాలంలో అద్భుత‌మైన సినిమాలు చేసిన ఎస్వీ కృష్ణా రెడ్డి త‌న సినిమాల‌తో ఎంతో మంది హీరోల‌కి లైఫ్ ఇచ్చాడు. అర్ధ ద‌శాబ్ధం నుండి సినిమాల‌కి దూరంగా ఉంటున్న ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్ష‌కుల‌కి గుడ్ న్యూస్ చెప్పారు. మిత్రులందరూ అడుగుతున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి గారి కొత్త సినిమా ఎప్పుడువస్తుంది ? అని… వారంద‌రికి శుభ‌వార్త‌. త్వరలోనే నా ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి అవసరమయిన స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకుంటున్నాను. నిర్మాణ సంస్థ, హీరో మొదలయిన అంశాలు చర్చలలో వున్నాయి. అతిత్వరలో నిర్దారణ అయ్యాక నిర్మాణం మొదలవుతుంది. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో రానుంద‌ని ఎస్వీ కృష్ణా రెడ్డి త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు.

Related posts